మైక్రోసాఫ్ట్ విండోస్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా భారత్, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో ఈ సమస్య తలెత్తింది. అనేక కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌లు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ చూపించి, ఆటోమేటిక్‌గా షట్‌డౌన్ అవుతున్నాయి. దీంతో పలు దేశాల్లో విమాన సేవలకు అంతరాయం కలిగింది. భారత్‌లో ఆకాష్, స్పైస్‌జెట్, ఇండిగో సేవలకు అంతరాయం ఏర్పడింది. విమాన టికెట్ల బుకింగ్, విమానాశ్రయాల్ల చెకిన్ సమస్యలు తలెత్తాయి.
పలు దేశాల్లో విండోస్ సమస్య తలెత్తడంతో మైక్రోస్టాఫ్ ఎక్స్ వేదికగా స్పందించింది. సాంకేతిక సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించింది. బ్రిటన్‌లో పోలీసు సేవలకు అంతరాయం ఏర్పడింది. పలు విమానాలను రద్దు చేశారు.బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. ఎక్స్ వేదికగా పలువురు తమకు ఎదురైన సమస్యను పోస్ట్ చేశారు. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ హ్యాకింగ్‌కు గురైనట్లు నిపుణులు అనుమానిస్తున్నారు.