ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి సియాటెల్‌లో ప్రమాదానికి గురై మరణించిన కందుల జాహ్నవి కేసులో ఎట్టకేలకు న్యాయం జరిగింది. 2023 జనవరిలో సియాటెల్ నగరంలో రోడ్డు దాటుతోండగా ఓ పోలీసు వాహనం కందుల జాహ్నవిని ఢీ కొట్టింది. ఆమె అక్కడే చనిపోయారు. ఆ తరవాత వాహనంలోని పోలీసు అడెరెర్ చేసిన వ్యాఖ్యల వీడియో ఒకటి వైరల్ అయింది.
ఆమె సాధారణ వ్యక్తి, ఆ మరణానికి విలువ లేదంటూ అడెరెర్ చేసిన వ్యాఖ్యల వీడియో ఆలస్యంగా వెలుగు చూసింది. వీడియో చూసిన పోలీసు అధికారులు అడెరెర్‌ను సస్పండ్ చేశారు. తాజాగా అడెరెర్‌ను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించినట్లు సియాటెల్ పోలీసు శాఖ అధిపతి సూ రహర్ వెల్లడించారు.
కందుల జాహ్నవిపై అడెరెర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని రహర్ అభిప్రాయపడ్డారు. ఆమె తల్లిదండ్రులకు ఆయన క్షమాపణలు చెప్పారు. ఇలాంటి చర్యలు పోలీసు శాఖను దిగజార్చతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అడెరెర్ వ్యాఖ్యలు పోలీసు శాఖకే మాయని మచ్చ తెచ్చాయని రహర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.