సౌరవిద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టుల కోసం భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో అధికారులకు లంచాలు ఇచ్చారంటూ అమెరికా గౌతమ్ అదానీ, మరో ఏడుగురి మీద కేసు వేసిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ చైర్మన్‌తో పాటు ఆయన మేనల్లుడు సాగర్ అదానీ, మరో ఆరుగురు అధికారులు 2020 నుంచి 2024 వ్యవధిలో రూ.2029 కోట్ల లంచాలు ఇచ్చారన్నది ఆ దావాలో ప్రధాన ఆరోపణ.
ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలినవారు అదానీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినీత్ జైన్, అజూర్ ఉద్యోగులు రంజిత్ గుప్తా, రూపేష్ అగర్వాల్, కెనడాకు చెందిన పెట్టుబడిదారు మాజీ ఉద్యోగులు సిరిల్ కబానెస్, సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా.ఆ సౌరవిద్యుత్ ప్రాజెక్టుల కోసం అమెరికన్ బ్యాంకులు, పెట్టుబడిదారుల నుంచి నిధుల సేకరించినప్పుడు ఈ లంచాల వివరాలు వారికి చెప్పలేదన్నది మరో ఆరోపణ. సౌరవిద్యుత్ కాంట్రాక్టులు దక్కించుకోవడం ద్వారా 2బిలియన్ డాలర్ల లాభాలు ఆర్జించాలన్నది అదానీల లక్ష్యమట.
ఆ ఆరోపణలు చేసినది బ్రియాన్ స్టాసీ పీస్. ఈస్టరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్‌కు 48వ అటార్నీ. అతను దాఖలు చేసిన ఈ కేసులో గౌతమ్ అదానీ మీద అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయిందని సమాచారం.
అదానీ గ్రూప్ మీద గతంలో హిండెన్‌బర్గ్ రిసెర్చ్ అనే సంస్థ మోసపూరిత ఆరోపణలు చేసింది. తర్వాత ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ అదానీని లక్ష్యం చేసుకుంది. ఇప్పుడు అమెరికాలో కేసు నమోదయింది. అదానీ మీద వచ్చిన ఆరోపణల సారాంశం, తమ సంస్థల ఎదుగుదల కోసం ఆయన అనైతిక పద్ధతులను పాటించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మూడు కేసుల వెనుకా ఉన్నది ప్రపంచ కుబేరుడు, స్వీయప్రకటిత వితరణశీలి జార్జి సోరోస్.
హంగేరియన్ అమెరికన్ యూదు అయిన జార్జి సోరోస్, అతని ‘ఓపెన్ సొసైటీ ఫౌండేషన్’ సంస్థ తరచుగా వివిధ దేశాల్లో ప్రభుత్వాలను మార్చేసే పనులు చేస్తుంటాయి. ప్రజాస్వామిక విధానాలంటే నమ్మకం లేని సోరోస్, ప్రజాస్వామిక దేశాలను కుప్పకూల్చి ఆయా దేశాల్లో అయోమయం, అవ్యవస్థ, గందరగోళం నెలకొనేలా చేస్తాడు. తనవైన తప్పుడు మార్గాల్లో తన ఉద్దేశాలను ప్రపంచం మీద రుద్దుతూ ఉంటాడు.
ఇప్పుడు అదానీల మీద కేసు విషయంలోనూ అదే జరిగింది. జార్జి సోరోస్ వెనకుండి నడిపిస్తున్న అటార్నీ బ్రియాన్ పీస్ అదానీ గ్రూప్ నిర్వాహకులు, దానికి సహకరిస్తున్న ఇతరులపై నిందితులంటూ ఆరోపణలు చేస్తున్నాడు. ఆ క్రమంలో అతని జాతకం బైటపడింది. అతనికీ జార్జి సోరోస్కీ ఉన్న సంబంధాలు వెలుగు చూసాయి. దాంతో ఇది చాలా పెద్ద కుట్ర అనీ, భారతీయ పారిశ్రామికవేత్తల పరువుప్రతిష్ఠలతో పాటు వారి వ్యాపారాలను సమూలంగా నాశనం చేయాలన్నది వారి దుర్బుద్ధి అని తెలుస్తోంది.
జార్జి సోరోస్, బ్రియాన్ పీస్ మధ్య సంబంధం?
బ్రియాన్ పీస్ జీవిత భాగస్వామి జాక్వెలిన్ జోన్స్ పీస్, అలబామా రాష్ట్రం మాంట్గోమరీలోని ఈక్వల్ జస్టిస్ ఇనీషియేటివ్ (ఈజేఐ) అనే సంస్థలో డైరెక్టర్, సీనియర్ అటార్నీగా పనిచేస్తున్నారు. ఈజేఐ మానవ హక్కుల కోసం లాభాపేక్ష లేకుండా పనిచేసే సంస్థ అని చెప్పుకుంటుంది. దాని వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రయాన్ స్టీవెన్సన్. అసలు విషయం ఏంటంటే అతను జార్జి సోరోస్‌కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ సంస్థ అమెరికా కార్యక్రమాల బోర్డులో సభ్యుడు కూడా. అలా, పీస్ దంపతులను తెరవెనుక నుండి ఆడిస్తున్న హస్తం జార్జి సోరోస్దే అన్న విషయం స్పష్టంగా తెలిసిపోయింది. అంతేకాదు, వారి దుర్మార్గమైన పొత్తు ద్వారా అదానీ గ్రూప్‌ను లక్ష్యం చేసుకుని, తెరవెనుక ఏదో వక్రబుద్ధితో కూడిన నాటకం జరుగుతోందన్న సంగతి తెలుస్తోంది.
జార్జి సోరోస్, అతని కుటుంబంతో చిరకాలంగా సంబంధాలున్న – యుఎస్ సెనేట్‌లో మెజారిటీ లీడర్ అయిన చక్ షుమెర్, 2021లో బ్రియాన్ పీస్ జ్యుడీషియల్ నియామకానికి బహిరంగంగా మద్దతు పలికాడు, అతన్ని ఆ పదవిలో నియమించే విషయంలో కీలక పాత్ర పోషించాడు. సోరోస్ కుటుంబం చేపట్టే కార్యక్రమాలు దాదాపు అన్నింటికీ చక్ షుమెర్ మద్దతు పూర్తిగా ఉంది. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సెనేట్‌లో నియంత్రణ సాధించడం కోసం డెమొక్రటిక్ పార్టీ ప్రయత్నిస్తున్నప్పుడు షుమెర్ అండగా నిలిచిన ‘సూపర్ పొలిటికల్ యాక్షన్ కమిటీ’… వాటికి మద్దతు పలకడానికి వామపక్ష కోటీశ్వరులు గణనీయంగా ఖర్చు పెట్టారు.
జూన్ 22న సోరోస్ ప్రధానంగా డెమొక్రసీ పిఎసి-2కు విరాళాలు ఇచ్చాడు. సెనేట్ మెజారిటీ పీఏసీకి జూన్ 22న జార్జిసోరోస్ 2.5 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చాడు. అలా అతను గత మూడేళ్ళలో ప్రపంచశాంతి కోసం కృషి చేస్తూ గత మూడేళ్ళలో మొత్తం 6 మిలియన్ డాలర్ల విరాళాలు సేకరించారు. 2024లో సోరోస్ మొత్తంగా పీఎసికి 16 మిలియన్ డాలర్లు సేవా కార్యక్రమాల పేరిట ఇచ్చాడు.