పూరీ జగన్నాథుడి ఆలయంలోని రత్న భాండాగారాన్ని ఎట్టకేలకు తెరిచారు. నేటి (ఆదివారం) మధ్యాహ్నం రహస్య గది తలుపులు తెరవగానే పూరి జిల్లా ఎస్పీ పినాక్ మిశ్రా గదిలోనే కళ్ళు తిరిగిపడిపోయారు. దాంతో ఆయనను ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
డాక్టర్ సీబీకే మహంతి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఎస్పీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
సుమారు 46 ఏళ్ళ విరామం తర్వాత రత్న భాండాగారాన్ని తెరిచి స్వామి సంపదను లెక్కించే ప్రక్రియను ప్రారంభించారు. మొత్తం 11 మంది సిబ్బంది తలుపులు తెరిచే ప్రక్రియ లో పాల్గొన్నారు. జగన్నాథుడి సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. చెక్క పెట్టెల్లో భద్రపర్చిన ఆభరణాల లెక్కింపు ను డిజిటలైజ్ చేయనున్నారు. నిధిని మరో చోటకు తరలించేందుకు కొత్తగా ఆరు భారీ చెక్క పెట్టెలను ప్రత్యేకంగా తయారు చేయించారు.
ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి బిశ్వనాథ్ రథ్, శ్రీ జగన్నాథ్ ఆలయ అధికారి అరబింద పాధీతోపాటు ,ASI సూపరింటెండెంట్ లోపలికి వెళ్లారు. మరో నలుగురు ఆలయ సహాయకులు కూడా వెళ్ళారు. భాండాగారం తలుపులు తెరిచే ముందు ‘ఆజ్ఞ’ పేరుతో ప్రత్యేక పూజా చేశారు. డిజిటల్ డాక్యుమెంటేషన్ తర్వాత లోపలి నిధిని మరోచోటుకు తరలించనున్నారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు