పాలస్తీనాలోని ఖాన్ యూనిస్, అల్ మవాసీపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. హమాస్ కమాండర్ మహమ్మద్ డెయిఫ్ లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. రఫాపై దాడుల సమయంలో పౌరులు అల్ మవాసీ తరలి వెళ్లాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. దీంతో లక్షలాది పౌరులు అల్ మవాసీ తరలివెళ్లారు. తాజాగా అక్కడ భీకరదాడులు చేయడంతో 90 మంది మరణించారు. వందల సంఖ్యలో పాలస్తీనా పౌరులు గాయపడ్డారని స్థానిక మీడియా ద్వారా తెలుస్తోంది.
హమాస్ కమాండర్ మహమ్మద్ డెయిఫ్ లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ దాడుల్లో డెయిఫ్ ఉన్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై మెరుపుదాడులతో యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి నేటి వరకు ఇరు పక్షాల్లో 36 వేల మంది చనిపోయారని అంచనా.