ఉన్మాద బాలురు పేట్రేగిపోయారు. కర్నూలు జిల్లా ముచ్చుమర్రి గ్రామానికి చెందిన బాలికపై ముగ్గురు బాలురు అత్యాచారం చేసి హత్య చేశారు. నాలుగు రోజుల కిందటే ఘటన జరిగినా పోలీసులు గోప్యంగా విచారణ సాగిస్తున్నారు. బాలిక మృతదేహం నేటికీ లభ్యం కాలేదు. బాలికను అత్యాచారం చేసి, చంపి ముచ్చుమర్రు ఎత్తిపోతల కాలువలో పడేశామని చెప్పడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో వెతికించారు. అయినా ఫలితం దక్కలేదు.
అత్యాచారం, హత్యకు పాల్పడిన బాలురు తలోమాట చెప్పడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. బాలిక మృతదేహం కోసం గాలిస్తున్నారు. మరో రెండు ప్రాంతాల్లో ప్రొక్రెయిన్తో తవ్వకాలు చేసేందుకు సిద్దం అయ్యారు. నిందితులు చెబుతున్న చోటల్లా పోలీసులు బాలిక మృతదేహం కోసం వెతుకున్నారు. బాలికను ఎవరైనా చంపారా అనే కోణంలోనూ పోలీసులు విచారణ సాగిస్తున్నారు.