వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మర్డర్ కేను నమోదైంది. తెలుగుదేశం పార్టీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గత నెల 11న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు 8 సెక్షన్ల కింద మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. 2021 మే 20న తనను అక్రమంగా అరెస్ట్ చేసి, చిత్రహింసలకు గురిచేసి, చంపే ప్రయత్నం చేశారని రఘురామరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు గుంటూరు నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.
మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిపై సహా మరో నలుగురిపై 8 సెక్షన్ల కింద కేసు నమోదైంది. సీఐడి మాజీ డీజీ పి.వి.సునీల్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు, డీఎస్పీ విజయ్ పాల్, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతిలపై హత్యాయత్నం సహా మొత్తం 8 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హత్యాయత్నం, అసభ్యంగా వ్యవహరించడం, సాక్ష్యాలు తారుమారు చేయడంలాంటి సెక్షన్ల కింద కేసు నమోదైంది.