ముంబైలో మరో ఘోరం జరిగింది. బాలుడు ఖరీదైన కారుతో యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను బలిగొన్న ఘటన మరవక ముందే మరో ప్రమాదం జరిగింది. శివసేన నాయకుడు రాజేష్ షా కుమారుడు మిహిర్ షా మద్యం సేవించి బీఎండబ్ల్యూతో ఓ మహిళ ప్రాణాలు తీశాడు. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
అంతకు ముందు మిహిర్ షా బాగా మందుకొట్టి, డ్రైవర్ ఉన్నా అతన్ని పక్కన పెట్టి స్వయంగా బీఎండబ్ల్యూ కారు నడిపినట్లు విచారణలో తేలింది. అతి వేగంగా స్కూటీపై వెళుతోన్న దంపతులను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో చేపలు అమ్ముకుని ఇంటికి వెళుతోన్న కావేరి నక్వా అక్కడికక్కడే చనిపోయింది. కావేరి నక్వాపై నుంచి బీఎండబ్ల్యూ కారు వేగంగా నడిపినట్లు తేలింది. ఆ తరవాత సాక్ష్యాలు చెరిపేందుకు కూడా ప్రయత్నాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. చట్టం అందరికి సమానంగా పనిచేస్తుందని సీఎం షిండే వ్యాఖ్యానించారు. బాధితులను తగిన న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు