ఎన్టీఆర్ జిల్లాలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. బాయిలర్ పేలిన ఘటనలో 20 మంది కార్మికులు గాయపడ్డారు.
బోదవాడలో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన కార్మికులు ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ కు చెందినవారిగా అధికారులు గుర్తించారు. క్షతగాత్రులను విజయవాడ, జగ్గయ్యపేటలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
ప్రమాద ఘటనపై కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ స్పందించారు. ప్రీ హీటర్ లోపంతోనే పేలుడు జరిగినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయిందన్నారు. ఘటనపై సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు నిర్దేశించారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు