అస్సాంలో ఘోరం జరిగింది. మార్కులు తక్కువ వచ్చాయని మందలించిన ఉపాధ్యాయుడినే ఓ అరాచక విద్యార్థి కత్తితో పొడిచి చంపిన ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
అస్సాంలోని శివసాగర్‌లో రాజేశ్ బారువా ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆ పాఠశాలలో 12వ తరగతి వరకు బోధన జరుగుతోంది. 11వ తరగతి చదువుతోన్న ఓ విద్యార్థికి మార్కులు తక్కువ రావడంతో తల్లిదండ్రులను పిలుచుకు రావాలని అతన్ని ఇంటికి పంపించాడు. ఆ విద్యార్థి గంట తరవాత స్కూల్ డ్రెస్ మార్కుకుని మరలా తరగతికి వచ్చాడు. రాజేశ్ బారువా అతన్ని బయటకు పంపించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో వెంట తెచ్చుకున్న కత్తితో కెమిస్ట్రీ ఉపాధ్యాయుడు రాజేశ్ బారువాను విచక్షణా రహితంగా పొడిచాడు. విద్యార్థులు పరుగులు తీయడంతో తోటి ఉపాధ్యాయులు రాజేశ్ బారువాను సమీప ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఈ ఘటన కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది.