బ్రిటన్ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అధ్యక్షుడు కీర్ స్టార్మర్ ప్రధానిగా నియమితులయ్యారు. ఇంగ్లాండ్ పార్లమెంటులో 650 స్థానాలుండగా లేబర్ పార్టీ 412 స్థానాలు దక్కించుకుంది. కన్జర్వేటివ్ పార్టీ 121 స్థానాలకే పరిమితమైంది. ఇంగ్లాండ్ 58వ ప్రధానిగా కీర్ స్టార్మర్ శుక్రవారంనాడు బాధ్యతలు చేపట్టారు. అనంతరం ప్రజల నుద్దేశించి ప్రసంగించారు.
ముందుగా అంచనా వేసిన సర్వేలు నిజం అయ్యాయి. లేబర్ పార్టీ ఘన విజయం సాధించబోతోందంటూ సర్వేలు ముందే వచ్చాయి. ఇంగ్లండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ ప్రాంతాల్లో మొత్తం 650 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇందులో 412 స్థానాలు దక్కించుకుని లేబర్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ 121 స్థానాలకే పరిమితమైంది. 14 సంవత్సరాల తరవాత ఇంగ్లాండ్లో లేబర్ పార్టీ మరోసారి అధికారం చేజిక్కించుకుంది.