రేణుకాస్వామి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. నటి పవిత్రా గౌడ నటుడు దర్శన్ భార్య కాదని తేలింది. దర్శన్ భార్య విజయలక్ష్మి ఈ విషయం పోలీసులకు లేఖ ద్వారా తెలియజేసింది. తమకు 2003లో వివాహం జరిగింది. పిల్లలు కూడా ఉన్నారని ఆమె లేఖలో పేర్కొంది. పవిత్రా గౌడతో దర్శన్ పదేళ్లుగా సహజీవనం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. పోలీసులు మీడియా సమావేశాల్లో దర్శన్ భార్య పవిత్రా గౌడ అంటూ చెబుతున్నారని, ఎఫ్ఐఆర్లో కూడా అలాగే రాశారని, దీనివల్ల తనకు, తన పిల్లలకు భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని ఆమె వాపోయారు.
పవిత్రాగౌడతో పదేళ్ల అనుబంధం అంటూ దర్శన్ కొంతకాలం కిందట పోస్టులు పెట్టాడు. అలా చేయడంతో విజయలక్ష్మికి అన్యాయం చేశాడని రేణుకాస్వామి అనే అభిమాని పవిత్రా గౌడకు అసభ్య వీడియోలు పంపడం ప్రారంభించారు. ఆమె ఆ విషయాన్ని దర్శన్‌కు చెప్పడంతో రేణుకాస్వామిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నటి పవిత్రా గౌడకు గతంలోనే సంజయ్‌సింగ్ అనే వ్యక్తితో వివాహం అయిందని, వారికి ఓ కుమార్తె జన్మించినట్లు పోలీసుల విచారణలో తేలింది.