భూమికి పెనుముప్పు తప్పింది. రెండు గ్రహ శకలాలు భూమికి అత్యంత దగ్గరగా వచ్చి వెళ్లాయి. ఆదివారం అంతర్జాతీయ గ్రహ శకల దినోత్సవం నాడు ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. 2024 ఎంకె అనే 200 మీటర్ల పొడవున్న గ్రహ శకలం ఆదివారంనాడు భూమికి 3 లక్షల కిలోమీటర్ల దగ్గరగా వచ్చి వెళ్లింది. ఇది చంద్రుని దూరంలో 77 శాతంతో సమానం. గ్రహ శకలాలు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తూ ఉంటాయి. పొరపాటున భూమిని ఢీకుంటే ఆ విపత్తు నష్టం అంచనా వేయడం కూడా కష్టమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మరో గ్రహం కూడా భూమికి దగ్గరగా ప్రయాణం చేసింది. 2011 యూఎల్21 అనే గ్రహం కిలోమీటర్లు వ్యాసార్థం కన్నా పెద్దగా ఉంది. ఇది 66 లక్షల కిలోమీటర్ల దూరంలో కనిపించింది. అంతర్జాతీయ ఖగోళశాస్త్రవేత్తలు ఈ గ్రహ శకలాలను గుర్తించారు. ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద గ్రహ శకలాలు భూమికి దగ్గరగా రావడం ఇదే మొదటి సారి. 20 మీటర్ల కన్నా పెద్దగా ఉంటే 55 లక్షల గ్రహ శకలాలు భూమికి దగ్గరగా ప్రయాణం చేస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు.