భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయం మొదలైంది. బ్రిటిష్ కాలంనాటి బూజు పట్టిన చట్టాలనే నేటి ఆదివారం అర్థరాత్రి కాలం చెల్లింది. ఐపీసీ, సిఆర్‌పీసీ, ఐఈఏ చట్టాల స్థానంలో, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అథినియమ్ వచ్చి చేరాయి. ఇక నుంచి అన్యాయం ఎక్కడ జరిగినా సమీపంలోకి పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, తరవాత సంబంధిత స్టేషన్‌కు బదిలీ చేయాల్సి ఉంటుంది.సమన్లు ఇచ్చే విధానం సరళతరం చేశారు. సంక్షిప్త సందేశం, వాట్సాప్ ద్వారా కూడా సమన్లు పంపించే వీలు కల్పించారు.
క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తైన 45 రోజుల్లో తీర్పు వెలువరించాల్సి ఉంది. ఇక విచారణ ప్రారంభించిన తరవాత 60 రోజుల్లోనే అభియోగాలు నమోదు చేశాయి. బ్రిటిష్ కాలంనాటి చట్టాల్లో శిక్షకు ప్రాధాన్యత ఇచ్చారని, కొత్త చట్టాల ద్వారా న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. గత పార్లమెంట్ ఆమోదించిన కొత్త చట్టాలు ఆదివారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.
కొత్త చట్టాల్లో సెక్షన్లు తగ్గించారు. బాలికలపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే జీవితఖైదు విధించనున్నారు. కొన్ని కేసుల్లో గతంలో ఐపీసీలో ఉన్న గందరగోళం, కొత్త చట్టాల్లో లేకుండా జాగ్రత్త పడ్డారు. మూకదాడి విషయంలో ఐపీసీలో సరైన సెక్షన్లు లేవు. కొత్త చట్టంలో అందుబాటులోకి తెచ్చారు. కొత్త చట్టాలు భారతీయుల ఆత్మ, శరీరం, స్ఫూర్తి అంటూ హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.