అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సునీతా విలియమ్స్, బుచ్ విల్మన్ తిరిగి భూమిని చేరుకునేందుకు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని ఐఎన్ఎస్ ప్రకటించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమిపై దిగేందుకు ఉపయోగించే స్టార్లైనర్ రాకట్లో సమస్యను గుర్తించారు. ఈ నెల 5న అంతరిక్ష కేంద్రం చేరుకున్న సునీతా విలియమ్స్, విల్మన్ తిరిగి జూన్ 14న భూమికి తిరిగి రావాల్సి ఉంది. సాంకేతిక సమస్యలు తెలెత్తడంతో ఈ నెల26కు వాయిదా వేశారు.
బోయింగ్ నూతనంగా తయారు చేసిన స్టార్ లైనర్ రాకెట్లో హీలియం సమస్యను గుర్తించారు. అంతరిక్ష కేంద్రానికి సునితా విలియమ్స్ చేరుకునే సమయంలోనూ హీలియం సమస్య తలెత్తింది. అయితే సునితా ప్రయాణానికి ఇబ్బంది ఏర్పడలేదు. ఇక తిరుగు ప్రయాణంలోనూ స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యను గుర్తించారు. సమస్యను చక్కదిద్దిన తరవాత సునీతా విలియమ్స్, విల్మన్ తిరిగి భూమికి చేరుకోనున్నారు. సునితా విలయమ్స్కు ఇది మూడో అంతరిక్ష యాత్ర కావడ విశేషం.