వారణాసి క్షేత్రం దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. గడచిన రెండున్నర ఏళ్ళలో మహాశివుడి దర్శనానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. పరమేశ్వరుడి భక్తుల రాకపోకలతో కాశీ కారిడార్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. డిసెంబర్ 2021లో ఈ కారిడార్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 16 కోట్ల 46 లక్షల మంది భక్తులు ఈ మార్గంలో ప్రయాణించారు. 2023తో పోలిస్తే 2024 ఆరు నెలల కాలంలో అధికంగా 48 శాతం మంది భక్తులు కాశీ విశ్వశురుడిని దర్శించుకున్నారు.
రికార్డు స్థాయిలో భక్తులు కాశీకి తరలివస్తుండటంతో పర్యాటక పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది. హోటళ్ళు మంచి గిరాకీ వస్తుండగా, బనారసీ చీరలు, హస్తకళా వస్తువులు విరివిగా అమ్ముడు పోతున్నాయి. కారిడార్ నిర్మాణం తరువాత మంచి స్థానిక వ్యాపారులు భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు.
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిరకూ రెండు కోట్ల 86 లక్షల 57 వేల 473 మంది భక్తులు కాశీ ధామ్ తరలివచ్చారు. దీంతో థామ్ ఆదాయం 33 శాతం మేర పెరిగింది.