కోన్ ఐస్క్రీమ్ ఎంతో ఇష్టంగా తింటుంటే, అందులో మనిషి వేలు బైటపడితే ఎలా ఉంటుంది? ఆ పరిస్థితే ఎదురైంది ఒకాయనకి. అతని ఫిర్యాదు మేరకు ఎఫ్ఎస్ఎస్ఎఐ స్పందించింది. ఐస్క్రీమ్ తయారుచేసే కంపెనీ లైసెన్సును సస్పెండ్ చేసింది.
మహారాష్ట్రలోని మలాడ్ వెస్ట్ ప్రాంతానికి చెందిన ఆర్లెమ్ బ్రెండన్ సెర్రా అనే 26ఏళ్ళ డాక్టర్ గత బుధవారం రాత్రి, ఒక యాప్ ద్వారా యమ్నో ఐస్క్రీమ్ షాప్ నుంచి మూడు ఐస్క్రీమ్లు ఆర్డర్ పెట్టారు. రాత్రి 10.10 గంటల సమయంలో ఐస్క్రీమ్ డెలివరీ అయింది. అది తింటుంటే ఉన్నట్టుండి ఒక మనిషి వేలు బైటపడింది. దాంతో అవాక్కయిన డాక్టర్ ఆ వేలి ఫొటో తీసాడు. ఐస్క్రీమ్ కంపెనీ ఉత్పత్తిదారుల ఇన్స్టాగ్రామ్ పేజ్లో దాన్ని పోస్ట్ చేసాడు. దాని గురించి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎప్ఎస్ఎస్ఎఐ) అధికారులకు ఫిర్యాదు చేసాడు.
ఎఫ్ఎస్ఎస్ఎఐ పశ్చిమ ప్రాంతీయ అధికారులు వెంటనే స్పందించారు. ఆ ఐస్క్రీమ్ తయారీ కంపెనీ లైసెన్సును రద్దు చేసారు. పశ్చిమ కేంద్ర కార్యాలయం అధికారుల బృందం ఐస్క్రీమ్ కంపెనీ కేంద్రాన్ని తనిఖీ చేసారు. వేలు దొరికిన ఐస్క్రీమ్ ఫోరెన్సిక్ నివేదిక ఇంకా రావలసి ఉంది.
ఐస్క్రీమ్ తయారీ కంపెనీ పుణేలోని ఇండాపూర్లో ఉందని, వారికి కేంద్ర లైసెన్సు కూడా ఉందని ఎఫ్ఎస్ఎస్ఎఐ వెల్లడించింది. తదుపరి దర్యాప్తు కోసం తయారీ కేంద్రం నుంచి నమూనాలు సేకరించారు.
ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మహారాష్ట్ర విభాగం కూడా ఐస్క్రీమ్ కంపెనీ వారి ముంబై తయారీ కేంద్రాన్ని తనిఖీ చేసింది, నమూనాలు సేకరించింది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు