టీ20 లీగ్ దశ ముగియనుంది. తాజాగా నేపాల్ జట్టుపై బంగ్లాదేశ్ విజయం సాధించి సూపర్ 8లో ప్రవేశించింది. గ్రూప్ డిలో సూపర్ 8లో ప్రవేశించిన రెండో జట్టుగా బంగ్లాదేశ్ నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు 19.3 ఓవర్లలో 106 పరుగులు చేసింది. షకిబ్ 17 పరుగులు చేశాడు. నేపాల్ జట్టులో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు. దీంతో బంగ్లా జట్టు 19.3 ఓవర్లకే ఆలౌటైంది. బంగ్లా జట్టులో సోంపాల్, దీపేంద్ర సింగ్, రోహిత్ పౌడెల్ రెండేసి వికెట్లు తీశారు.
లక్ష్య సాధనలో నేపాల్ బ్యాటర్లు తడబడ్డారు. ఆసిఫ్ 17, కుశాల్ 27, దీపేంద్ర సింగ్ 25 మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. 19.2 ఓవర్లకు 85 పరుగులు చేసి నేపాల్ జట్టు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లు తన్జిమ్ 7 పరుగులిచ్చి 4 వికెట్లు తీశారు. ముస్తాఫిజర్ 3, షకిబ్ 2 వికెట్లు తీశారు. నేపాల్ జట్టు ఇంటిబాట పట్టడంతో ఇక గ్రూప్ డిలో సూపర్ 8లోకి ప్రవేశించేది ఎవరో తేలిపోయింది. పాకిస్థాన్, శ్రీలంక జట్లు చివరి మ్యాచుల్లో విజయం సాధించాయి.అయినా ఆ రెండు జట్లూ సూపర్ 8లోకి ప్రవేశించే అవకాశం లేదు.