మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జోగి రమేష్‌కు చెందిన ఇబ్రహీంపట్నంలోని ఇంటిపై ఆదివారం ఈ దాడి జరిగింది. వెంటనే సిబ్బంది అప్రమత్తం కావడంతో దుండగులు పారిపోయారు.
మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి తరవాత ఇబ్రహీంపట్నం సీఐ సత్యన్నారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కొందరు కారులో వచ్చి దాడికి దిగినట్లు సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. సీసీ ఫుటేజీ పరిశీలించి నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని సీఐ మీడియాకు చెప్పారు.