ఉత్తరాఖండ్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న టెంపో అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో పదిమంది 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నేడు (శనివారం) ఉదయం 11.30 గంటలకు 23 మంది ప్రయాణికులతో టెంపో రుద్రప్రయాగ్ కు పయనమైంది. ఈ క్రమంలోనే అదుపు తప్పిన వాహనం 200 మీటర్ల లోతైన లోయలో పడింది. రైటోలి సమీపంలో రిషికేశ్- బద్రీనాథ్ హైవేపై ఈ దారుణం జరిగింది. వాహనం లోయలోని అలనంద నదిలో పడిపోయినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు