టీ-20 ప్రపంచకప్‌లో గ్రూప్-C నుంచి అప్ఘనిస్తాన్ సూపర్-8కి చేరింది. పాపువా న్యూగినీపై అప్ఘనిస్తాన్ విజయంతో న్యూజీలాండ్ ఇంటిబాట పట్టింది. ఉగాండా, పాపువా న్యూగినీ కూడా నిష్క్రమించాయి.
తొలుత బ్యాటింగ్ చేసిన న్యూగినీ 19.5 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌట్ కాగా ఆ జట్టులో కిప్లిన్ డొరిగా (27) మాత్రమే రాణించారు. టోని ఉరా (11), అలీ నావో (13) మినహా ఎవరూ రెండంకెల పరుగులు చేయలేకపోయారు.
అప్ఘన్ బౌలర్ ఫరూఖి మూడు వికెట్లు తీయగా నవీన్ ఉల్ హక్ రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నాడు. నూర్ అహ్మద్ ఒక వికెట్ తీశాడు.
లక్ష్య ఛేదనలో అప్ఘనిస్తాన్ 15.1 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి విజయం సాధించింది. ఓపెనర్లు గుర్బాజ్ (11), ఇబ్రహీం జద్రాన్ (0) త్వరగా వికెట్లు కోల్పోయారు. గుల్బాదిన్ నైబ్ (49*), ఒమర్జాయ్ (13), మహమ్మద్ నబీ (16*) జట్టును విజయం వైపు నడిపించారు.
ఇంగ్లండ్ విజయం….
టీ 20 వరల్డ్ కప్ ట్రోఫీలో ఇంగ్లండ్ జయకేతనం ఎగురవేసింది. గ్రూప్ బిలో ఒమన్‌పై విజయం సాధించింది. ఒమన్‌ను కేవలం 47 పరుగులకే ఆలౌట్ చేసిన బ్రిటీష్ జట్టు 3.1 ఓవర్లలోనే 50 పరుగులు సాధించి విజయాన్ని అందుకుంది.
కెప్టెన్ జోస్ బట్లర్ (24*) ఫిలిప్ సాల్ట్ (12) జానీ బెయిర్ స్టో (8*) సత్తా చాటారు. ఇంగ్లండ్ బౌలర్లు అదిల్ రషీద్ నాలుగు వికెట్లు తీయగా మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్ చెరి మూడు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
ఇంగ్లండ్ తన చివరి మ్యాచ్‌లో నమీబియాపై విజయం సాధించడంత పాటు ఆసీస్ చేతిలో స్కాట్లాండ్ ఓడిపోతేనే ఇంగ్లండ్‌కు ‘సూపర్-8’ అవకాశం దక్కుతుంది.