ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈనెల 12న విజయవాడలో ట్రాఫిక్ మళ్లించినట్లు పోలీసు కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ తెలిపారు. విజయవాడ నుంచి గన్నవరం వైపు వెళ్ళే వాహనాల రాకపోకలకు అసౌకర్యం కలుగకుండా మళ్ళింపు చేశారు.
విజయవాడ నుంచి ఏలూరు, విశాఖపట్నం వైపు ప్రయాణించే కార్లు, బైకులు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బెంజ్ సర్కిల్ నుంచి కంకిపాడు–పామర్రు–హనుమాన్ జంక్షన్–ఏలూరు వైపు వెళ్ళాలి.
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలు.. హనుమాన్ జంక్షన్ వద్ద నుంచి నూజివీడు, జి. కొండూరు, ఇబ్రహింపట్నం మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. విశాఖపట్నం నుంచి చెన్నై వైపు వెళ్లు వాహనాలు, హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, పెనుముడి వారధి రేపల్లె, బాపట్ల, త్రోవగుంట ఒంగోలు మీదుగా వెళ్ళాల్సి ఉంటుంది.
చెన్నై నుంచి హైదరాబాద్ వైపు వెళ్ళే వాహనాలు, అద్దంకి, నరసరావుపేట, పిడుగురాళ్ల, మిర్యాలగూడెం, నల్గొండ వైపు మళ్లించారు.
విజయవాడ ఏలూరు వైపు వెళ్లు బస్సులు.. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి, ఏలూరు రోడ్, హోటల్ స్వర్ణ పాలెస్, చుట్టుగుంట, గుణదల, రామవరప్పాడు రింగ్, ఇన్నర్ రింగ్ రోడ్, నున్న బైపాస్, నూజివీడు, హనుమాన్ జంక్షన్, ఏలూరు వైపు వెళ్లాలి.
విజయవాడ రామవరప్పాడు రింగ్ నుంచి గన్నవరం వైపు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వెళ్లే వాహనాలు, అంబులెన్స్, అత్యవసర ఆరోగ్య చికిత్స వాహనాల తప్ప ఏ ఇతరవాహనాలు గన్నవరం వైపు అనుమతించడం లేదని సీపీ రామకృష్ణ తెలిపారు.