అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో సూపర్ బగ్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘ఎంటర్‌బాక్టర్ బుగాన్‌డెన్సిస్’ అనే బ్యాక్టీరియా ఉన్నట్టు నిర్ధారించారు. మూసి ఉండే వాతావరణంలో పెరిగే ఈ బ్యాక్టీరియా బహుళ ఔషధాలను నిరోధించ గలిగే శక్తి కలిగి ఉంటుందన్నారు. మల్టీ-డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టిరియా కావడంతో దీనిని ‘సూపర్ బగ్’ గా పిలుస్తారు. శ్వాసకోశ వ్యవస్థపై ఈ బ్యాక్టీరియా ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సూపర్ బగ్ కారణంగా అంతరిక్ష కేంద్రంలో భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌తో పాటు మరో ఎనిమిది మంది ఇబ్బందుల్లో పడ్డారు.సునీతా విలియమ్స్, యూజీన్ వ్యోమగామిలు జూన్ 6, 2024న స్పేస్ స్టేషన్ కు వెళ్ళారు. మిగతా ఏడుగురు చాలా కాలంగా అక్కడే ఉన్నారు. వ్యోమగాముల ద్వారా భూమి నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఈ బ్యాక్టిరియా చేరి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
వ్యోమగాముల ఆరోగ్యంపై సూక్ష్మజీవుల ప్రభావాన్ని అంచనా వేసే పరిశోధనలు జరుగుతున్నాయి. కాలిఫోర్నియాలోని పసాదేనా కేంద్రంగా పనిచేస్తున్న నాసా ‘జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ’కి చెందిన డాక్టర్ కస్తూరి వెంకటేశ్వరన్ సారధ్యంలో ఈ రీసెర్చ్ జరుగుతుంది. వెంకటేశ్వరన్ నాసాలో చేరడానికి ముందు చెన్నైలోని అన్నామలై విశ్వవిద్యాలయంలో మెరైన్ మైక్రోబయాలజీ అభ్యసించారు.
మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు మీదుగా 2023లో ‘కలామిల్లా పియర్సోని’ అనే కొత్త మల్టీ-డ్రగ్ రెసిస్టెంట్ బగ్‌ని కనుగొన్నారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు