ఏఆర్ కానిస్టేబుల్ వేదవతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటి ఎస్పీ కార్యాలయం వద్ద చోటు చేసుకుంది. మెయిన్ గేటు వద్ద కాపలాగా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ వేదవతి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటన జరగిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని వేదవతిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.
ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య విషయాన్ని ఆమె భర్త దస్తగిరికి తెలియజేశారు. వెంటనే ఆయన ఆసుపత్రికి చేరుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. వేదవతి భర్త నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. వీరికి ఏడేళ్ల కిందట వివాహమైంది. ఐదేళ్ల కుమార్తె ఉంది. దస్తగిరికి ఇది రెండో వివాహం.వేదవతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.