రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీవ్ర విషాదం మిగిల్చింది. స్కార్పియోలో వివాహానికి వెళ్ళి వస్తుండగా లారీ ఢీ కొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ లోని ఆళ్లగడ్డకు చెందిన వెంకటేశ్ తన కుటుంబంతో సహా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. ఆళ్లగడ్డలో ఉంటున్న తన బావమరిది పెళ్లికి హాజరయ్యేందుకు కుటుంబంతో కలిసి వెళ్లారు. సాయంత్రం కుటుంబంతో కలిసి తిరుగు పయనం అయ్యారు. రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న స్కార్పియో, ముందు వెళుతున్న లారీ ని ఢీకొట్టంది. దీంతో
వెంకటేశ్, ఆయన భార్య పుష్ప, తల్లి లత, మేనల్లుడు ఆదిత్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంకటేశ్ కొడుకు నందు, కూతురు తరుణి, అక్క కవితలకు తీవ్ర గాయాలు అయ్యాయి.