సింగపూర్ ఓపెన్‌లో భారత మహిళల డబుల్స్ జోడీ సత్తా చాటింది. త్రిషా జాలీ, గాయత్రీ గోపీచంద్ జోడీ కొరియన్ సో యోంగ్, కాంగ్ హీ యోంగ్‌ను ఓడించి సెమీ ఫైనల్స్‌లో అడుగు పెట్టారు. ప్రపంచంలో 30 ర్యాంకులో ఉన్న భారత మహిళల డబుల్స్ జోడీ, సింగపూర్ ఓపెన్‌లో మొదటిసారి ఫైనల్స్ చేరుకుంది. ప్రత్యర్థి కొరియన్ జట్టును 18-21, 21-19, 24-22తో చిత్తు చేశారు.
జపాన్‌కు చెందిన నమీ మత్సుయామా, చిహారు షిఫా, ఇండోయేషియాకు చెందిన ఆప్రియాని రహాయు, సితి ఫాడియా సిల్వా రామధాంతి మధ్య శనివారం క్వార్టర్ ఫైనల్ జరగనుంది. అందులో విజేతలతో భారత జోడీ తలపడాల్సి ఉంది.
క్వార్టర్ ఫైనల్లో భారత ఆటగాళ్లు ప్రపంచ నెంబరు 2 కొరియన్ జంట బేక్ నా హా, లీ సో హీతో తలపడ్డారు. వారిని 21-9, 14-21, 21- 15 తేడాతో ఓడించారు. దాదాపు గంటకుపైగా మ్యాచ్ సాగింది.