రుణ దారుణం మరొకటి వెలుగు చూసింది. లోన్ యాప్ నిర్వాహకుల బెదిరింపులు తట్టుకోలేక ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద జరిగింది. విజయవాడకు చెందిన మురికివంటి వంశీ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. లోన్ యాప్ నుంచి రూ.10వేలు రుణం తీసుకున్నాడు. వడ్డీతో లక్ష కట్టాలంటూ యాప్ నిర్వాహకులు వేధింపులు ప్రారంభించారు. భయపడ్డ విద్యార్థి వంశీ ఇంట్లో నుంచి ఈ నెల 25న కనిపించకుండా వెళ్లిపోయాడు.
చనిపోతున్నానంటూ కుటుంబసభ్యులకు మెసేజ్ పంపాడు. ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వంశీ కోసం వెతికారు. తాడేపల్లి కృష్ణా సమీపంలో ఫోన్, చెప్పులు కనిపించాయి. నదిలో గాలించగా వంశీ మృతదేహం లభ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.