ఏపీలో పలు రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది చనిపోయారు. తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలోని జాతీయ రహదారిపై ఎం.కొంగరవారిపల్లె వద్ద కారు అదుపుతప్పి డివైడన్‌ను ఢీకొన్న ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అత్యంత వేగంగా వెళుతోన్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టినట్లు పోలీసులు గుర్తించారు. మృతులు కాణిపాకం వెళుతోండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
కృష్ణా జిల్లా బాపులపాడు సమీపంలోని జాతీయ రహదారిపై వేగంగా వెళుతోన్న కారు డివైడర్‌ను ఢీకొని,పక్క లైన్‌లోని లారీని తాకింది. దీంతో కారులోని నలుగురు వ్యక్తులు చనిపోయారు. ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొవ్వూరు నుంచి తమిళనాడు వెళుతోండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. కాకినాడ జిల్లా రామవరం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్రాంత జడ్జి మోహన్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు.