ఛత్తీస్‌గఢ్ బెమెతెరా జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గన్‌పౌడర్ పరిశ్రమలో పేలుడు జరిగి, 17 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. రోజు మాదిరే కార్మికులు ఉదయాన్నే కర్మాగారానికి వచ్చి పని ప్రారంభించారు. కాసేపటికే పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో కార్మికులు చనిపోయినట్లు తెలుస్తోంది. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు సమీపంలోని ఆసుపత్రుల్లో చేర్పించారు.
జిల్లా కలెక్టర్ రణ్‌బీర్ శర్మ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పేలుడు జరిగిన ప్రాంతంలో 20 అడుగుల మేర పెద్ద గొయ్యి ఏర్పడింది. అందులో కొందరు చిక్కుకున్నారని తెలుస్తోంది. మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టతలేదు. కానీ పదుల సంఖ్యలో చనిపోయారని తెలుస్తోంది.ప్రమాద కారణాలు తెలియాల్సి ఉంది.