పుణెలో తాగి కారు నడిపి ఇద్దరు సాఫ్‌వేర్ ఇంజనీర్ల మృతికి కారణమైన బాలుడి తాతను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదం సమయంలో బాలుడు కారు నడపడం లేదని, డ్రైవర్‌పై నెట్టే ప్రయత్నాన్ని పోలీసులు పసిగట్టారు. డ్రైవర్‌కు డబ్బు ఆశ చూపి అతని కుటుంబాన్ని చూసుకుంటానని, త్వరలో బెయిల్‌పై విడుదల చేయిస్తానని బాలుడి తాత చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.
రోడ్డు ప్రమాదం తానే చేశానంటూ పోలీసుల ముందు ఒప్పుకోవాలంటూ తన వద్ద పనిచేసే డ్రైవర్‌ను బాలుడి తాత బెదిరించినట్లు పుణె పోలీసులు తెలిపారు. దీంతో బాలుడి తాతను పోలీసులు అరెస్ట్ చేశారు.
గత శనివారం పుణెలోని కల్యాణి నగర్ ప్రాంతంలో లగ్జరీ కారులో అత్యంత వేగంగా బైక్‌పై వెళుతోన్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను ఢీ కొట్టడంతో వారు అక్కడి కక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే. తాగి ప్రమాదానికి కారణమైన బాలుడికి స్థానిక జడ్జి 15 గంటల్లోనే బెయిల్ ఇవ్వడంపై దేశ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. దీంతో పోలీసులు రివ్యూ పిటిషన్ వేశారు. బాలుడిని అరెస్ట్ చేసి జువైనల్ హోంకు తరలించారు.