బెంగళూరు రేవ్ పార్టీలో పొల్గొన్న వారి నుంచి పోలీసులు బ్లడ్ శాంపిల్స్ తీయించారు. మొత్తం ఈ పార్టీలో 200 మంది పొల్గొన్నారు. వీరిలో 103 మంది డ్రగ్స్ వాడినట్లు తేలింది. వీరి రక్తంలో డ్రగ్స్ ఆనవాళ్లు గుర్తించారు. తెలుగు నటికి కూడా పాజిటివ్ వచ్చిందని బెంగళూరు పోలీసు అధికారులు వెల్లడించారు.
గత ఆదివారం బెంగళూరు పోలీసులు రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నట్లు గుర్తించి 200 మందిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వీరిలో నటులు, వ్యాపారులు, సెలబ్రిటీలు, బెట్టింగ్ రాయుళ్లు, రాజకీయ నేతల అనుచరులు ఉన్నట్లు గుర్తించారు. విజయవాడకు చెందిన బెట్టింగ్ వాసు ఈ రేవ్ పార్టీ నిర్వహించినట్లు తేలింది. అతని ఫోన్ నెంబరులో ఏపీలో పోలీసు అధికారుల నెంబర్లు ఉండటంతో బెంగళూరు పోలీసులు దర్యాప్తును మరింత లోతుగా సాగిస్తున్నారు.