పశ్చిమబెంగాల్ జల్పాయిగుడిలో కొందరు దుండగులు అరాచకానికి పాల్పడ్డారు. జల్పాయిగుడిలోని రామకృష్ణ మిషన్పై దాడికి తెగబడ్డారు. ఆయుధాలతో కొందరు దుండగులు సాదువులు, ఉద్యోగులపై తొపాకులు ఎక్కుపెట్టి బెదిరింపులకు పాల్పడ్డారు. ఆశ్రయం ఖాళీ చేయాలంటూ కేకలు వేసి, విధ్వంసానికి దిగారు.
దాడికి దిగిన దుండగులు సీసీటీవీ ఫుటేజీ డిలీట్ చేశారు. కెమెరాలు పగులగొట్టారు. మెయిన్ గేటుకు తాళం వేసుకుని వెళ్లారని బాధితులు తెలిపారు.రామకృష్ణ మిషన్ భూమిని కబ్జా చేయాలని కొందరు దుండగులు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారని సిబ్బంది వాపోయారు.