దేశంలో ఐదో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఐదో దఫా 49 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ మొదలైంది. 695 మంది అభ్యర్థులు ఐదో దశ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా సహా పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు.
ఉత్తరప్రదేశ్‌లో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్‌లో 7, బిహార్‌లో 4, ఝార్ఖండ్ 3, జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లో ఒక్కోటి చొప్పున ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 543 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు పూర్తయిన తరవాత జూన్ 4న ఫలితాలు ప్రకటించనున్నారు.
యూపీలోని రాయ్‌బరేలీ, అమేఠీ లోక్‌సభ నియోజకవర్గాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గతంలో కాంగ్రెస్ కంచుకోటలుగా ఈ నియోజకవర్గాలు ఉండేవి. 2019లో అమేఠీలో రాహుల్‌గాంధీపై స్మృతి ఇరానీ సంచలన విజయం సాధించింది. రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి రాయ్‌బరేలీ నుంచి బరిలో నిలిచారు. ఐదో విడతతో కలసి మొత్తం 428 ఎంపీ సీట్లకు నేటి సాయంత్రంతో ఎన్నికలు పూర్తయినట్లు అవుతుంది.