నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది. బనగానపల్లి, కోయిలకుంట్ల, అవుకు, సంజమాల,కొలిమిగుండ్ల మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. మొత్తం 233290 మంది ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు.
బనగానపల్లి నియోజకవర్గం ఏర్పడిన తరవాత 2009లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి కాటసాని రామిరెడ్డి, 2014లో టీడీపీ నుంచి బీసీ. జనార్థన్‌రెడ్డి, 2019లో వైసీపీ నుంచి కాటసాని రామిరెడ్డి విజయం సాధించారు.
2009 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్థి కాటసాని రామిరెడ్డి, సమీప టీడీపీ అభ్యర్థి చల్లా రామకృష్ణారెడ్డిపై 13686 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బొబ్బనల చిన్నోల జనార్థన్ రెడ్డి, సమీప వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డిపై 17341 ఓట్ల ఆధిక్యం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి, సమీప టీడీపీ అభ్యర్థి బొబ్బల చిన్నోళ జనార్ధన్ రెడ్డిపై 13384 ఓట్ల మెజారిటీ సాధించారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి కాటసాని రామిరెడ్డి, టీడీపీ నుంచి బీసీ. జనార్థన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి గూటం పుల్లయ్య బరిలో నిలిచారు.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు