నంద్యాల లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల, బనగానపల్లె, డోన్ అసెంబ్లీ నియోజకవర్గాలు నంద్యాల లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ 1576945 మంది ఓటర్లు ఉన్నారు. 1997లో ఇక్కడ నుంచి గెలిచిన నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా, 1991లో గెలిచిన పీవీ. నరసింహారావు ప్రధానిగా సేవలు అందించారు.
1952 సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల లోక్సభ నియోజవకర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి రాయసం శేషగిరి రావు, 1957, 1962, 1967, 1971లో కాంగ్రెస్ అభ్యర్థి పెండేకంటి వెంకటసుబ్బయ్య, 1977లో జనతా పార్టీ నుంచి నీలం సంజీవరెడ్డి,1977, 1980లో కాంగ్రెస్ నుంచి పెండేకంటి వెంకట సుబ్బయ్య విజయం సాధించారు.
1984లో టీడీపీ అభ్యర్థి మద్దూరు సుబ్బారెడ్డి, 1989లో కాంగ్రెస్ అభ్యర్థి బొజ్జా వెంకట రెడ్డి, 1991, 1996లో కాంగ్రెస్ నుంచి పీవీ నరసింహారావు, 1996, 1998, 1999లో టీడీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి విజయం సాధించారు. 2004, 2009, 2014లో కాంగ్రెస్ నుంచి ఎస్పీవై రెడ్డి, 2019లో వైసీపీ నుంచి పొచ్చా బ్రహ్మానందరెడ్డి గెలుపొందారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి పొచ్చా బ్రహ్మానందరెడ్డి, టీడీపీ నుంచి బైరెడ్డి శబరి బరిలో నిలిచారు. నంద్యాలలో వైసీపీ బలంగా ఉంది. టీడీపీ మహిళను రంగంలోకి దింపి ప్రయోగం చేస్తోంది. ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారో వేచిచూడాలి.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు