కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. ఇది పూర్తిగా నగర నియోజకవర్గం. ఇక్కడ 258815 ఓట్లున్నాయి.ముస్లింలు, బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు. బీసీల అండ, ముస్లింల ఆశీస్సులు ఎవరికి దిక్కితే వారిదే గెలుపు.
1952లో జరిగిన మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదరం సంజీవయ్య విజయం సాధించారు. తరవాత కాలంలో ఆయన మొదటి దళిత సీఎంగా సేవలందించారు. 1955లో కాంగ్రెస్ అభ్యర్థి మహబూబ్ అలీ ఖాన్, 1962లో స్వతంత్ర అభ్యర్థి టీకేఆర్ శర్మ, 1967లో కాంగ్రెస్ నుంచి కేఈ మాదన్న, 1972లో పి. రహ్మాన్ ఖాన్, 1978లో మహ్మద్ ఇబ్రహీం ఖాన్ కాంగ్రెస్ నుంచి గెలిచారు. 1983, 1985, 1989లో టీడీపీ నుంచి వి. రాంభూపాల్ చౌదరి హ్యాట్రిక్ సాధించారు.
1994లో సీపీఎం నుంచి ఎం.అబ్దుల్ గఫూర్, 1999లో టీడీపీ నుంచి టీజీ వెంకటేష్, 2004లో సీపీఎం నుంచి ఎం.అబ్దుల్ గఫూర్ విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ నుంచి టీజీ వెంకటేష్, 2014లో వైసీపీ నుంచి సోముల వెంకట మోహన్ రెడ్డి, 2019లో అబ్దుల్ హఫీజ్ ఖాన్ గెలిచారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి ఏ.ఎండీ. ఇంతియాజ్, టీడీపీ నుంచి టీజీ భరత్, సీపీఎం నుంచి డి.గౌస్ దేశాయ్, జాతీయ సమ సమాజం పార్టీ నుంచి ఏపీ రామయ్య యాదవ్ బరిలో నిలిచారు.