పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. రాజ్‌భవన్‌లో పనిచేసే ఉద్యోగిని గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆరోపణలను రాజ్‌భవన్ తీవ్రంగా ఖండించింది.
రాజ్‌భవన్‌లో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు అధికార పార్టీకి ఏజెంట్లుగా మారి అసత్య ప్రచారం చేస్తున్నారని రాజ్‌భవన్ వర్గాలు ట్వీట్ చేశాయి. లైంగిక ఆరోపణల ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారని, వారిని ఆ దేవుడే చూసుకుంటారని ఎక్స్ వేదికగా ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ పర్యటనకు ఒక్కరోజు ముందు ఇలాంటి ఆరోపణలు రావడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి.
రాజ్‌భవన్ తాత్కాలిక ఉద్యోగిని ఒకరు గురువారం గవర్నర్ బంగ్లాలోని పోలీస్ పోస్టులో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్థానిక స్టేషన్‌కు బదిలీ చేశారు.ఉద్యోగం విషయంలో
సహాయం చేస్తానంటూ గవర్నర్ తనను వేధించాడని ఉద్యోగిని ఫిర్యాదులో పేర్కొన్నారు.