మథురలోని
శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం, షాహి ఈద్గా మసీదు వివాదంలో అలహాబాద్ హైకోర్టులో ఇరువర్గాలు
వాదనలు వినిపించాయి.
ఈద్గా
మసీదును తొలగించాలనే పిటిషన్‌ను సవాల్‌చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో హిందువుల తరఫు
న్యాయవాది హరి శంకర్ జైన్ వాదించారు.
ప్రార్థనా స్థలాల చట్టం ఈ కేసుకు
వర్తించదని వాదించిన హరిశంకర్ జైన్, శ్రీకృష్ణ ఆలయం రక్షిత కట్టడమని, ప్రాచీన నిర్మాణాలు, పురావస్తు స్థలాలు, అవశేషాల చట్టం-1958ను దీనికి
వర్తింపజేయాల్సి న్యాయస్థానాన్ని కోరారు. ఆలయంలో పూజలు నిర్వహించడం భక్తుల హక్కు
అని దానిని, ప్రార్థనా స్థలాల చట్టం అడ్డుకోజాలదన్నారు.
ముస్లింల తరఫున తస్లిమా అజీజ్ అహ్మదీ వాదనలు వినిపించారు.
షాహి ఈద్గా మసీదును తొలగించాలన్న పిటిషన్‌కు
విచారణ అర్హత లేదన్నారు. ఇరు వర్గాలు వాదనలు విన్న జస్టిస్ మయాంక్ జైన్
ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది.