పాలస్తీనా అనుకూల నినాదాలతో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ రగిలిపోతోంది. అనుకూల వాదులను పోలీసులు బలవంతంగా ఖాళీ చేయించారు. వారంతా లాస్‌ఏంజెలిస్ నగరంలోకి ప్రవేశించారు. నిరసనకారులు రోడ్ల వెంట వేసుకున్న గుడారాలను పోలీసులు బలవంతంగా ఖాళీ చేయించారు. అంతకు ముందు యూనివర్సిటీలో రచ్చ జరిగింది. ప్రాగణం ఖాళీ చేసి వెళ్లాలని పోలీసులు చేసిన హెచ్చరికలను ఆందోళనకారులు పట్టించుకోలేదు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పదుల సంఖ్యలో విద్యార్థులు, పోలీసులు గాయపడ్డారు.
పాలస్తీనా అనుకూల నినాదాలతో మూడు వారాలుగా కొలంబియా యూనివర్సిటీ అట్టుడుకుతోంది. ఆందోళనలు మాడిసన్‌లోని విస్కాన్సిస్ యూనివర్సిటీకి కూడా విస్తరించాయి. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తూ ఆ దేశ సహకారం తీసుకోవద్దని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. గడచిన మూడు వారాల్లో 2 వేల మందిని పోలీసులు అరెస్టు చేశారు.
పాలస్తీనా అనుకూల నినాదాలపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందించారు. ఆందోళనలు అరాచకానికి దారితీయకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు నిరసన తెపవచ్చని అయితే అది అరాచకానికి దారితీయకూడదని బైడెన్ హితవు పలికారు.