దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగే
అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం డైరక్టర్ జనరల్ మృత్యంజయ్ మోహపాత్ర తెలిపారు. మే
లో11 రోజుల పాటు వడగాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ
శాఖ అంచనా వేసింది.
రాజస్థాన్, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, దిల్లీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఇంటీరియర్ ఒడిశా, గంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బిహార్, కర్ణాటక, తెలంగాణలోని
మిగిలిన ప్రాంతాల్లో ఐదు నుంచి ఏడు రోజుల వరకు వడగాలులు వీచే అవకాశాలున్నాయన్నారు. ఏప్రిల్‌లో ఎండల పెరుగుదలకు ప్రధాన కారణం
ఉరుములతో కూడిన వర్షాలు లేకపోవడమేనని వాతావరణశాఖ వివరించింది.
ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకూ
ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో
వృద్ధులు, చిన్నారులు, రోగులు నానా
అవస్థలు పడుతున్నారు. పల్నాడు జిల్లా
కొప్పునూరులో బుధవారం అత్యధికంగా 46.2 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదు
కాగా, తిరుపతి జిల్లాలోని మంగనెల్లూరులో 46, ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లులో 45.8 డిగ్రీలు, నంద్యాల జిల్లా బనగానపల్లె, నెల్లూరు జిల్లా మర్రిపాడులో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఆంధ్రప్రదేశ్ లో 21
జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. నేడు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలోని 265 మండలాల్లో వడగాలులు వీస్తాయని
వాతావరణ శాఖ హెచ్చరించింది.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు