Wednesday, July 2, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

ఆంధ్రప్రదేశ్ లో  కూటమి మేనిఫెస్టో : ప్రతీ మహిళకు నెలకు రూ. 1,500, రైతుకు ఏడాదికి రూ. 20 వేలు

param by param
May 12, 2024, 10:35 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఆంధ్రప్రదేశ్
లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశాయి. టీడీపీ
అధినేత చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్
పాల్గొన్నారు.

భారతీయ
జనతాపార్టీ జాతీయ స్థాయిలో మేని ఫెస్టో గత వారం విడుదల చేయడం జరిగిందని గుర్తు
చేసిన సిద్ధార్థ్ నాథ్ సింగ్ ,
రాష్ట్రాలలో
పొత్తు లో ఉన్న ఎన్డీయే  భాగస్వామ్య పార్టీలు
మేని ఫెస్టో విడుదల చేస్తాయని వాటికి ఎన్డీయే భాగస్వామి గా బీజేపీ మద్దతు
ఉంటుందన్నారు. అందుకే మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నట్లు వివరించారు.

ఃఆడబిడ్డ
నిధి కింద ప్రతీ మహిళకు నెలకు రూ.1,500 అందజేస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో
పేర్కొన్నారు. 18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న మహిళలకు ఆడబిడ్డ పథకం వర్తింపు
చేస్తామని హామీ ఇచ్చారు. తల్లికి వందనం పేరిట 
ఒక్కో విద్యార్థికి రూ.15,000 సాయాన్ని 
ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తామని
వాగ్దానం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యంతో పాటు  డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని
రుణాలు అందజేస్తామని హామీ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ కూటమి నేతలు దీపం పథకం కింద ప్రతి
కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తామన్నారు.

రైతులకు
ఏడాదికి పెట్టుబడి సాయం కింద  రూ. 20 వేలు
నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి అందజేస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఇక
యువతకు ఐదేళ్ళలో వివిధ సెక్టార్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన కూటమి
, ప్రభుత్వం ఏర్పడితే మెగా డీఎస్సీ పై
తొలి సంతకం చేస్తామని పేర్కొంది.

బీసీల
రక్షణకు ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయడంతో పాటు 50 ఏళ్ళు నిండిన బీసీలకు రూ. 4 వేలు
అందజేస్తామన్నారు. బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల వ్యయం
చేస్తామని వాగ్దానం చేశారు. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ ను
పునరుద్ధరించి  నామినేటెడ్ పదవుల్లో
ప్రాధాన్యత కల్పిస్తామన్నారు.
 
చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం
కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామని,   తక్కువ
జనాభా కారణంగా తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న వర్గాలకు నామినేటెడ్ పోస్టుల ద్వారా
రాజ్యాధికారంలో భాగం కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. బీసీ కులాల దామాషా
ప్రకారం వారి ఆర్థికస్థాయిని బట్టి జన గణన… దాని ప్రకారం కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో
పాటు  స్వయం ఉపాధి కోసం ఏడాదికి రూ.10 వేల
కోట్ల బడ్జెట్ కేటాయింపునకు హామీ ఇస్తున్నట్లు కూటమి పేర్కొంది.  ఆదరణ కింద రూ.5 వేల కోట్ల ఆధునిక పనిముట్ల అందజేస్తామని,
యాదవులు అధికంగా ఆధారపడే పాడి పరిశ్రమకు బీమా సౌకర్యం, గొర్రెల పెంపకంపై ఆధారపడిన
కురుబ వర్గం సాధికారతకు చర్యలు చేపడతామని కూటమి నేతలు తెలిపారు.

చేనేత పరిశ్రమలో ఇబ్బందుల్లో
ఉన్నవారికి పవర్ లూమ్ వారికి 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్ వారికి 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇవ్వడంతో పాటు  ప్రతీ కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల సాయం
చేస్తామని కూటమి మేనిఫెస్టోలో వెల్లడించారు.  దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు
రూ.25 వేల గౌరవ వేతనంతో పాటు నాయిబ్రాహ్మణులకు  షాపులకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితం
అందజేస్తామని ప్రకటించారు.
అధికారంలోకి వస్తే గీత కార్మికులకు
మద్యం షాపుల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించడంతో పాటు, వడ్డెరలకు క్వారీల్లో 15
శాతం రిజర్వేషన్.రాయల్టీ, సీనరేజి చార్జీల్లో మినహాయింపు  హామీ అమలు చేయనున్నట్లు బీజేపీ, జనసేన, టీడీపీ
ఉమ్మడి మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

దోబీ ఘాట్ లకు  200 యూనిట్ల విద్యుత్ ఉచితం ఇవ్వడంతో పాటు ప్రతీ
ఇంటికీ ఉచితంగా కుళాయి కనెక్షన్ అందజేయనున్నట్లు వాగ్దానం చేశారు. సముద్ర వేట
విరామ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేల ఆర్థిక సాయంతో పాటు, జీవో.217 రద్దుకు సముఖత.  
వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి
ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని తెలిపిన ఎన్డీయే (ఏపీ),   5 వేల టన్నుల నిల్వ సామర్థ్యంతో కూడిన కోల్డ్
స్టోరేజీల ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసింది.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడంతో
పాటు చిన్న మధ్య తరహా పరిశ్రమలు, అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో
గరిష్ఠంగా రూ.10 లక్షల సబ్సిడీ అందజేస్తామన్నారు.
ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన 10
శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు  చేయడంతో పాటు  అగ్రవర్ణ పేదలకు విద్యా, ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది.
గ్రామ, సచివాలయ వాలంటీర్లకు గౌరవ వేతనం
రూ.10 వేలకు పెంపు   రూ.4 వేల
పెన్షన్లను 2024 ఏప్రిల్ నుంచి వర్తింపజేస్తూ పంపిణీకి ఆదేశిస్తామని పేర్కొంది. దివ్యాంగులకు
నెలకు రూ.6 వేలు… పూర్తిస్థాయి వైకల్యం ఉన్నవారికి రూ.10 వేలు సాయం, కిడ్నీ
వ్యాధులు, తలసేమియా బాధితులకు నెలకు రూ.10 వేల
పెన్షన్ అందజేస్తామని ఎన్నికల వాగ్దానాల్లో ఎన్డీయే పేర్కొంది.
విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మాణంతో
పాటు నూర్ బాషా కార్పొరేషన్ కు ఏటా రూ.100 కోట్లు కేటాయింపు చేయనున్నట్లు కూటమి
నేతలు ఉమ్మడి మేనిఫెస్టోలో తెలిపారు.

మైనారిటీల  కోసం హామీలు
.    

 మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్
నుంచి  రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు

•         ఇమామ్,
మౌజన్లకు రూ.10 వేలు, రూ.5 వేలు గౌరవవేతనం

•         అర్హత
ఉన్న ఇమామ్ లను ప్రభుత్వ ఖ్వాజీలుగా నియామకం

•         మసీదుల
నిర్వహణకు ప్రతి నెల రూ.5 వేల ఆర్థికసాయం

•         హజ్
యాత్రకు వెళ్లే ప్రతీ ముస్లింకు రూ.1 లక్ష ఆర్థికసాయం

Tags: BJPJana Sena Alliance Joint ManifestoTDP
ShareTweetSendShare

Related News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్
general

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.