ఆంధ్రప్రదేశ్
లాసెట్(law set) దరఖాస్తు గడువును మే4 వరకు పెంచుతున్నట్లు
కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ తెలిపారు.
2024-25 విద్యా ఏడాదికి సంబంధించి ఆంధ్రప్రదేశ్
లోని న్యాయ కళాశాలల్లో వివిధ లా
కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో
ఎంట్రన్స్ జరుగుతోంది.
ఎలాంటి
ఆలస్య రుసుం లేకుండా మే 4 వరకు గడువును పొడిగిస్తున్నట్లు
తెలిపారు. రూ.500 ఆలస్య రుసుంతో మే 11 వరకు, రూ.1000 ఆలస్య రుసుం తో మే 18 వరకు, రూ.2 వేల ఆలస్య రుసుంతో మే 25
వరకు, రూ.3 వేల ఆలస్య రుసుంతో మే 29
వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు.
దరఖాస్తుల
సవరణకు మే 30 నుంచి జూన్ 1 వరకు అవకాశం కల్పించారు. అడ్మిట్
కార్డులు జూన్ 3 నుంచి వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతామని, లా సెట్, పీజీ లా సెట్ పరీక్షలు జూన్ 9న
మధ్యాహ్నం 2:30 నుంచి 4:00 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్ష పూర్తిగా కంప్యూటర్ ఆధారిత మోడ్‌లో ఆన్‌లైన్
లో తెలుగు, ఇంగ్లిషులో జరగనుంది.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు