దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రెండో విడత పోలింగ్ చురుగ్గా సాగుతోంది. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం 10 గంటలు దాటితే ఎండలు మండుతాయనే భయంతో ఓటర్లు ఉదయమే ఓటేసేందుకు బారులు తీరారు. రెండో దశలో 13 రాష్ట్రాల్లో 88 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకే ఓటింగ్ ప్రక్రియ మొదలైంది.
కేరళలో మొత్తం 20 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కర్ణాటకలో 14 లోక్సభ స్థానాలకు రెండో దశలో ఎన్నికలు మొదలయ్యాయి. రాజస్థాన్ 13, మహారాష్ట్ర, యూపీల్లో 8 చొప్పున, మధ్యప్రదేశ్లో 7 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రెండో దఫా ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, శశిథరూర్ సహా పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు. పోలింగ్ శాతం వివరాలు అందాల్సి ఉంది.