ఇజ్రాయెల్ గాజా యుద్ధ ప్రభావం అమెరికాలోని యూనివర్సిటీలపై పడింది. గాజాలోని పాలస్తీనా పౌరులకు అనుకూలంగా అమెరికాలోని యూనివర్సిటీల్లో విద్యార్ధులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. రోజు రోజుకు ఈ ఉద్యమాలు పెరుగుతున్నాయి. చాలా యూనివర్సిటీల్లో పోలీసులను రంగంలోకి దింపారు. బుధవారం బోస్టన్ ఎమర్సన్ కళాశాలలో విద్యార్ధులు మెరుపు ఆందోళనకు దిగారు. వెంటనే 108 మంది పోలీసులను మోహరించారు.
ఆందోళన చేస్తోన్న విద్యార్ధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురు గాయపడ్డారు. కాలిఫోర్నియా యూనివర్సిటీలో 93 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. కొలంబియా యూనివర్సిటీ నిరసనలకు కేంద్రంగా నిలిచింది. విద్యార్ధులతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. నిరసనలు పెరగకుండా చర్యలు చేపట్టారు.