ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడుకు ఇంటి పోరు తప్పేలాలేదు. అనకాపల్లి లోక్‌సభ వైసీపీ అభ్యర్థిగా ముత్యాలనాయుడు బరిలో దిగారు. అయితే ఆయన కుమారుడు మాడుగుల అసెంబ్లీ అభ్యర్థిగా రెబెల్‌గా నామినేషన్ వేయడానికి సిద్దపడ్డారు. మాడుగుల అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా ముత్యాలనాయుడు రెండో భార్య కుమార్తె ఈర్లె అనూరాధ పేరును పార్టీ ప్రకటించింది.అప్పటి నుంచి మొదటి భార్య కుమారుడు రవికుమార్ తిరుగుబాటు జెండా ఎగరేశాడు. మాడుగుల నుంచి ఇండిపెండెంటుగా బరిలో దిగనున్నట్లు ప్రకటించారు. అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇవాళ రవికుమార్ నామినేషన్ వేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
రవికుమార్‌ను బుజ్జగించేందుకు వైసీపీ అధిష్టానం మంత్రి అమర్నాథ్ను రంగంలోకి దింపింది. రవికుమార్‌కు ఎన్నికల తరవాత పదవి ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో రవికుమార్ ఇండిపెంటెంటుగా బరిలో దిగుతారా లేదా అనేది తేలిపోనుంది.