తెలంగాణ
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో మరోసారి బాలికలు హవా చాటారు. మొదటి ఏడాదిలో 60.01 శాతం మంది రెండో సంవత్సరంలో 64.19 శాతం విద్యార్థులు
ఉత్తీర్ణత సాధించారు. బాలికల విభాగంలో ప్రథమ సంవత్సరంలో 68.35 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. బాలుర
విభాగంలో కేవలం 51.5 శాతం మంది మాత్రమే
ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో
72.53 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులు కాగా, బాలుర కేటగిరీలో 56.1 శాతం మంది మంది ఉత్తీర్ణత సాధించారు.
జిల్లాల
వారీగా చూసుకుంటే ఫస్టియర్ ఫలితాల్లో
రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో, మేడ్చల్
జిల్లా రెండో స్థానంలో నిలిచాయి. సెకండ్
ఇయర్ ఫలితాల్లో ములుగు జిల్లాకు ప్రథమ స్థానం దక్కగా మేడ్చల్ జిల్లా రెండో
స్థానంలో నిలిచింది.
ఫలితాల ను https://tsbie.cgg.gov.in/,
http://results.cgg.gov.in లలో తెలుసుకోవచ్చు.
తెలంగాణలో
ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగగా 9,80,978 మంది
పరీక్షలు రాశారు.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు