Srikakulam Assembly Constituency Profile
జిల్లా, జిల్లా కేంద్రం, నియోజకవర్గంగా ఉన్న ఊరు శ్రీకాకుళం. ఆంధ్రప్రదేశ్
ఉత్తర దిక్కున ఆఖరి జిల్లా, ఒడిషాతో సరిహద్దులు పంచుకునే శ్రీకాకుళం… శాసనసభ,
లోక్‌సభ నియోజకవర్గాలుగా ఉంది. శ్రీకాకుళం అసెంబ్లీ స్థానంలో శ్రీకాకుళం, గార అనే
రెండు మండలాలు ఉన్నాయి.
శ్రీకాకుళం శాసనసభా నియోజకవర్గం 1951లో ఏర్పడింది. 1952లో జరిగిన మొదటి
ఎన్నికలు మొదలు మూడు దశాబ్దాల్లో కాంగ్రెస్ ఒక్కసారే గెలిచింది. అలాంటి
శ్రీకాకుళంలో 1983 నుంచి 1999 వరకూ తెలుగుదేశం హవా నడిచింది. 2004, 2009లో వైఎస్
రాజశేఖరరెడ్డి ప్రభావంతో కాంగ్రెస్ అభ్యర్ధిగా ధర్మాన ప్రసాదరావు రెండుసార్లు
గెలిచారు. 2014లో తెలంగాణ విభజన ప్రభావంతో తెలుగుదేశం గెలిచింది. 2019లో ధర్మాన వైఎస్ఆర్‌సిపి
అభ్యర్ధిగా విజయం సాధించారు.
ఇప్పుడు
2024లో వైఎస్‌ఆర్‌సిపి తరఫున ధర్మాన ప్రసాదరావు మరోసారి బరిలో నిలిచారు. సిట్టింగ్
ఎమ్మెల్యే, మంత్రి అయిన ధర్మానను ఎదుర్కోడానికి ఎన్‌డిఎ కూటమి తరఫున గొండు శంకర్
పోటీ చేస్తున్నారు. ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా పైడి నాగభూషణరావు పోటీ
పడుతున్నారు.