Amudalavalasa Assembly Constituency Profile
శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస 1976లో శాసనసభా నియోజకవర్గంగా
ఏర్పడింది. అంతకుముందు నగరికటకం నియోజకవర్గం ఉండేది. ఆముదాలవలస నియోజకవర్గంలో ఆముదాలవలస,
పొందూరు, సరుబుజ్జిలి, బుర్జ అనే నాలుగు మండలాలు ఉన్నాయి.
1978లో ఎన్నికలు జరిగిన మొదటిసారి ఆముదాలవలసలో కాంగ్రెస్ గెలిచింది. ఆ
తర్వాత ఎన్‌టిఆర్ హవాతో మొదలుపెట్టి తెలుగుదేశం విజయాలు సాధించింది. 1989లో
కాంగ్రెస్ గెలుపు మినహా 1999 వరకూ తెలుగుదేశం తరఫున తమ్మినేని సీతారాం గెలుస్తూ వచ్చారు.
2004, 2009లో మళ్ళీ రెండుసార్లు కాంగ్రెస్ తరఫున బొడ్డేపల్లి సత్యవతి ఎమ్మెల్యే
అయ్యారు. తెలంగాణ విభజన ప్రభావంతో 2014లో తెలుగుదేశం మళ్ళీ పుంజుకుంది.
ప్రజారాజ్యం మీదుగా వైఎస్ఆర్‌సిపిలోకి చేరిన తమ్మినేతి సీతారాంను టిడిపి అభ్యర్ధి
కూన రవికుమార్ ఓడించారు. అయితే 2019లో మళ్ళీ తమ్మినేని వైసీపీ అభ్యర్ధిగా విజయం
సాధించారు.
2024 శాసనసభ
ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్‌సిపి తరఫున తమ్మినేని సీతారాం మరోసారి ఎన్నికల బరిలోకి
దిగారు. ఎన్‌డిఎ కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్ధి కూన రవికుమార్ తలపడుతున్నారు.
ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా సన్నపాల అన్నాజీరావు పోటీపడుతున్నారు.