స్కాట్లాండ్లో విషాదం
చోటుచేసుకుంది. ఇద్దరు భారతీయ విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటి మునిగి చనిపోయారు. గ్యారీ, తుమ్మెల్ నదులు కలిసే పెర్త్‌షైర్‌లోని
లిన్ ఆఫ్ తుమ్మెల్ జలపాతం వద్ద ఇద్దరి మృతదేహాలను ఎమర్జెన్సీ సర్వీసు సిబ్బంది
వెలికితీశారు.
డూండీ
యూనివర్సిటీలోని విద్యార్థులు టూర్ కు వెళ్ళారు. నలుగురు స్నేహితులు ట్రెక్కింగ్
చేస్తుండగా ఇద్దరు నీటిలో పడి
మునిగిపోయారు. మరో ఇద్దరు విద్యార్థులు ఈ
విషయాన్ని అత్యవసర సర్వీసు సిబ్బందికి ఫోన్ చేసి తెలిపారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక,
వైద్య సిబ్బంది సహాయ చర్యలు చేపట్టాయి.
లండన్‌లోని భారత హైకమిషన్
ప్రతినిధి ఈ ఘటనపై మాట్లాడుతూ.. దురదృష్టకర
సంఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు నీట మునిగి చనిపోయారని
విచారం వ్యక్తం చేసింది.
భారత కాన్సులేట్ జనరల్, విద్యార్థుల కుటుంబాలతో
సంప్రదింపులు జరుపుతుందన్నారు. నేడు పోస్ట్‌మార్టం చేసిన తర్వాత మృతదేహాలను
స్వదేశానికి పంపించేందుకు చర్యలు చేపడతారు.
ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా
లేక ఏవరైనా కావాలని వారిని నీటిలో పడేశారా అనే కోణంలో దర్యాప్తు జరుగుతుందని
స్కాట్లాండ్ పోలీసు అధికారి తెలిపారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు