Muslim youth killed girl for rejecting his proposal
కర్ణాటకలోని హుబ్బళ్ళిలో గురువారం నాడు దారుణం
జరిగింది. 24ఏళ్ళ యువతిని ఆమె కళాశాల ఆవరణలోనే పలుమార్లు కత్తితో పొడిచి చంపాడు.
హత్య చేసిన ఫయాజ్ అనే యువకుడు కూడా అదే కాలేజీ విద్యార్ధి. మృతురాలు నేహా హీరేమఠ్
స్థానిక కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హీరేమఠ్ కుమార్తె.
హుబ్బళ్ళిలోని బివి భూమారెడ్డి కాలేజ్ ఆఫ్
ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో నేహా ఎంసీఏ మొదటి సంవత్సరం విద్యార్ధిని. ఫయాజ్ అదే
కళాశాలలో బిసిఎ విద్యార్ధి. వారిద్దరూ బీసీఏలో సహాధ్యాయులు. నేహా బీసీఏ పూర్తిచేసి
ఎంసీఏలో చేరగా, ఫయాజ్ బీసీఏ మధ్యలోనే ఆపేసాడు.
నేహా కళాశాల నుంచి బైటకు వచ్చే సమయం కోసం ఫయాజ్ వేచి
చూసాడు. ఆ సమయానికి దారి కాచి కత్తితో దాడి చేసాడు. ఆమెను మెడపై కత్తితో పలుమార్లు
క్రూరంగా పొడిచాడు. ఆ దృశ్యాలు సిసిటివి కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ముఖాన్ని
మాస్క్‌తో దాచుకున్న ఫయాజ్, నేహాను పలుమార్లు పొడిచిన తర్వాత ఘటనాస్థలం నుంచి
పారిపోయాడు.
పోలీసులు చెప్పిన వివరాలు, రికార్డ్ అయిన వీడియోలోని దృశ్యాల ప్రకారం…
ఫయాజ్ నేహాతో గొడవ పడ్డాడు. ఆమె అక్కడినుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ
ఫయాజ్ ఆమెను లాగి పట్టుకుని నేలకేసి అదిమిపెట్టాడు. పలుమార్లు పొడిచాడు. జరుగుతున్న
విషయాన్ని గ్రహించి, సమీపంలోని విద్యార్ధులు అక్కడికి చేరుకునేలోగానే ఫయాజ్
అక్కడినుంచి పారిపోయాడు.
బాధితురాలిని తోటి విద్యార్ధులు కిమ్స్
ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. కానీ ఆమె తీవ్రమైన గాయాల కారణంగా చనిపోయింది.
ఫయాజ్ కొన్ని నెలల నుంచీ నేహా వెంట పడుతున్నాడు.
తనతో సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడు. కానీ ఆమె అతన్ని నిరాకరిస్తూ
వస్తోంది. గురువారం ఫయాజ్ ప్రణాళిక ప్రకారం కత్తి
తెచ్చుకుని వచ్చాడు. నేహాను అడ్డగించాడు.
ఆమె మరోసారి అతని ప్రతిపాదనను తిరస్కరించడంతో తను వెంటపెట్టుకుని తెచ్చిన కత్తితో
పొడిచి పొడిచి చంపాడు.
పోలీసులు ఫయాజ్ను అరెస్ట్ చేసారు. తదుపరి విచారణ
కొనసాగుతోంది. ఫయాజ్, నేహాను హత్య చేయాలని ముందుగానే సిద్ధపడ్డాడని పోలీసులు
చెప్పారు. తనను నిరాకరిస్తే నేహాను చంపేస్తానంటూ ఫయాజ్ తన మిత్రులకు ఎప్పటినుంచో
చెబుతున్నాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.
నేహా కుటుంబ సభ్యులకు ఫయాజ్ గురించి ఏమీ తెలీదట.
నేహా అతని గురించి ఎప్పుడూ చెప్పనేలేదని వారు వివరించారు.
స్థానిక ఎమ్మెల్యే
ప్రసాద్ అబ్బయ్య సహా పలువురు కాంగ్రెస్ నాయకులు ఆస్పత్రిలో నేహా మృతదేహాన్ని సందర్శించారు.
ఆమె కుటుంబానికి సంతాపం తెలియజేసారు. నిందితుడిపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ
హుబ్బళ్ళి నగర ఎబివిపి యూనిట్ కళాశాల ముందు ఆందోళన నిర్వహించింది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు